Archive for the ‘Telugu’ Category
హక్కుల తాత్వికత-సాహిత్య వాస్తవికత – - వివిన మూర్తి
హక్కుల తాత్వికత-సాహిత్య వాస్తవికత - వివిన మూర్తి
(AndhraJyothy, October 8th 2012)
బాలగోపాల్ గొప్ప చైతన్యంతో చేసిన వివరణలూ ప్రయత్నించిన సవరణలూ అదే కోవకి చెందిన సాహిత్యకారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, చర్చించాలనీ నా ఆశ. అప్పుడు సృజన, విమర్శ అంగాల ద్వారా బలం సంతరించుకుని సమాజ గమనంలో క్రియాశీల పాత్ర వహించగలదు సాహిత్యం. ఇప్పటితో పోలిస్తే మార్క్సునాటికి సమాచార సేకరణ, విస్తరణ ఎంతో కష్టసాధ్యం. అయినా ఆయన కృషి ‘ప్రపంచ మానవాళి’ అన్న తాత్విక దృష్టిని ప్రవేశపెట్టగలిగింది. ఈ దృష్టితో ప్రభావితమైన సాహిత్యం మానవుడిని కేంద్రంగా చేసుకుంది. తెలుగు సాహిత్యంలో కూడా ఈ తాత్విక దృష్టిని చాలావరకూ ప్రధానం చేసుకుంది. ఈ పరిధిలోనే వెలువడిన సాహిత్యం అనేక సమూహాలతో నిండిన మన సమాజంలోని అన్ని సమూహాలనూ స్పృశించలేకపోయింది. మన సాహిత్యంలో వివిధ సమూహాల స్వయం వ్యక్తీకరణ ఆరంభమైంది…
బాలగోపాల్ జీవించినకాలంలో జీవించినందుకు, ఆయనతో నేరుగా మాటలాడగలిగినందుకు, ఆయనని చదవగలిగినందుకు గర్వపడేవారిలో నేనొకడిని. చిత్తశుద్ధీ, మేధావిత్వం, ఆచరణ గలవారిలో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఆయన జీవితంలో అధిక భాగాన్ని హక్కుల ఉద్యమం లో వినియోగించారు. ఈ సందర్భంగా ఆయన పరిశీలనలను, అభిప్రాయాలను అనేక సందర్భాలలో వివరించారు. వాటిని మానవహక్కుల వేదిక ‘హక్కుల ఉద్యమం తాత్విక దృక్పథం’ అన్న పుస్తకంగా ప్రచురించింది. ఈ పుస్తకం చదువుతుంటే హక్కుల ఉద్యమానికి సామాజిక గమనంలో గల ప్రత్యేక స్థానాన్నీ, ప్రత్యేక తాత్వికతనూ గురించి వారి మనసులో గల రూపం మన కంటికి కడుతుంది.
మనసుకి పడుతుంది. దీనిలో బాలగోపాల్ కార్యకర్తగానే కాకుండా తాత్వికునిగా కనిపిస్తారు. వాటిలో అనేక చర్చనీయాంశాలు ఉన్నాయి. కొన్నింటిని నేను మరోకోణంలో చూడవచ్చు. కొన్నింటితో నాకు పూర్తి ఏకీభావం కుదరకపోవచ్చు. ఈ వ్యాసం వాటినన్నింటినీ పరిశీలించటానికి, బేరీజు వేయటానికీ ఉద్దేశించినది కాదు. నేను కేవలం సాహిత్యపు ఆలోచనల వాడిని, వారి సాధికారత, వారి ఆచరణ, అనుభవాల ఫలితం. పోతే- ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ నేను కృషి చేస్తున్న సాహిత్యానికి సంబంధించిన అనేక ఆలోచనలు కలిగాయి. వాటిని పంచుకోటమూ, చర్చకు పెట్టటమూ ఈ వ్యాసం ఉద్దేశ్యం.
సాహిత్యానికీ హక్కుల ఉద్యమానికీ సంబంధం నా మొదటి ఆలోచన. ఇది వివరించే ముందు బాలగోపాల్ హక్కుల ఉద్యమం గురించి చెప్పిన ప్రధాన అంశాలు అదే వరసలో చెప్పుకుందాం.
1. ఈనాడు మనకు కొన్ని హక్కులు చట్టరూపంలో ఉన్నాయి. ఇవి మనకు లభించటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధిపత్యరూపాలపై పోరాటాలు జరిగాయి. ఇందులో ఏవీ అయాచితంగా లభించలేదు. అంటే నాగరికత, ప్రజాతంత్ర భావనలు మానవుడి పోరాట ఫలితాలు. ఇది మనం నమ్మాలి. బాలగోపాల్ మాటల్లో ‘ప్రజాస్వా మ్యం అనేది కొన్ని హక్కులు, విలువలు, సంస్థలు, ప్రక్రియల కలయిక. ఇవి చరిత్రలో అనేక పోరాటాల ఫలితంగా వచ్చినవి.’ ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాటకంగా, బూటకంగా, భ్రమగా, బూర్జువా వర్గాల కుట్రగా భావించరాదు. దాని విలువను, బూర్జువా పాలకులు దానిని ఉపయోగించుకునే విధానాన్నీ విడివిడిగా చూడా లి.
2. హక్కుల ఉద్యమం చట్టాల ద్వారా లభించిన హక్కుల అమలుకి ప్రయత్నిస్తుంది. లేని హక్కుల అవసరాన్ని గుర్తిస్తుంది. వాటి సాధనకి పోరాడుతుంది.
3. హక్కుల ఉద్యమ కార్యకర్తలు ఆలోచనాపరులు. అల్పసంఖ్యాకులైన వీరు అధిక సంఖ్యాకులను చైతన్యపరచి వారితో కలసి ఉద్యమిస్తారు.
4. రాజకీయ ఉద్యమాల అవసరాలకోసమే హక్కుల ఉద్యమాలు చారిత్రకంగా పుట్టాయి. అవి ఆ అవసరాలకు పరిమితమై పోకుండా తమ అనుభవాలతో అవగాహన పెంచుకుని, విలువలని నిర్వచించుకుంటూ సాగినపుడే మరిం త వ్యాప్తి చెందాయి.
5. హక్కుల ఉద్యమాలు స్వతంత్రంగా నడవాలి. రాజకీయ ఉద్యమ లక్ష్యాలతో, విధానాలతో విభేదించవలసిన సందర్భాలలో అవి తీసుకునే వైఖరి, వ్యవహరించే ధోరణి ప్రజాతంత్ర భావనకి నిర్ణయాత్మకమైనవి.
6. కమ్యూనిస్టు రాజకీయ ఉద్యమాలు వ్యవస్థలో మార్పుని ప్రధానంగా చేసుకుంటాయి. అయితే అనేక వ్యవస్థలు ఉన్నాయని, అవన్నీ మార్పు కావలసి ఉన్నాయనీ, వాటన్నింటి మార్పుకీ ఉమ్మడి ఉద్యమం (లేదా ఉమ్మడి మార్పు) అజెండాకి ప్రత్యామ్నాయంగా పలు వ్యవస్థల మార్పు అన్నది అజెండా కావాలని బాలగోపాల్ అభిప్రాయపడతారు. ఈ పలు వ్యవస్థలలో ఒకటిగానే కార్మిక పెట్టుబడిదారీ వ్యవస్థని చూడాలని వారు సూచిస్తారు. స్త్రీ పురుషుల మధ్య, అగ్రవర్ణాలు దళితుల మధ్య ఘర్షణలో స్త్రీలూ, దళితులూ కోరుకునే హక్కులకీ, కార్మికులు కోరుకునే హక్కులకీ మధ్య తాత్వికమైన తేడాపట్ల తన వాదనను బలంగా వినిపిస్తారు.
7. నాగరికత, ప్రజాతంత్ర వ్యవస్థల చరిత్రగతిని హక్కుల ఉద్య మ అవగాహనలో భాగం చేసుకుని హక్కుల పరిభాష నిర్మించుకోవాలి. అది విప్లవ పరిభాష కన్న భిన్నంగా, స్వతంత్రంగా, తాత్వికమైన లోతుతో ఉండాలి. ఈ వ్యాసానికి సంబంధించిన మేరకు బాలగోపాల్ హక్కుల తాత్వికతలో ఇవి ప్రధాన అంశాలు.
సాహిత్యానికీ హక్కులఉద్యమానికీ సంబంధం ఏమిటో ఆలోచిద్దాం.
1. పైవాటిలో మూడవది ఈ రెంటిలో పాల్గొనేవారి పోలికను చర్చించటానికి ఉద్దేశించినది. హక్కుల కార్యకర్తలు ఈనాడు చైతన్యం గల వ్యక్తులు. తోటి మనుషుల కష్టాలను పట్టించుకునే వ్యక్తులు. ఓనాడు అవసరాలు తొయ్యటంతో రాజకీయ పోరాటాలు (పరిమిత అర్థంలో) జరిగి హక్కులు ఉమ్మడిగా సంపాదించుకోటం జరిగి ఉండవచ్చు. ఈనాడు వీరు సంఘంగా ఏర్పడితే మాత్రమే ఉద్యమించగలరు. ఒక తాత్విక అవగాహన నుంచి చూస్తే ప్రజావసరాల నుంచే ప్రజల ఆకాంక్షల ఫలితంగానే ఇప్పటి ఉద్యమాలు పుట్టాయని వ్యాఖ్యానించవచ్చు. కాని వాస్తవంగా ఈ కార్యకర్తలు చైతన్యం గల వ్యక్తులు. ఆ ఉద్యమాలలో ఆచరణ, అనుభవాలు ఉమ్మడి అవగాహనకి దారితీస్తాయన్నదీ వాస్తవమే.
సాహిత్య సృజన, విమర్శలలో పాల్గొనేవారు ప్రధానంగా వ్యక్తు లు. సామాజిక కారణాల ప్రేరణతో పాల్గొనే వారినే ఈ వ్యాసంలో పరిశీలించినా, వీరి సృజనకి ప్రేరణ స్వీయ వ్యక్తీకరణే. అది సమూ హ వ్యక్తీకరణగా అర్ధం చెప్పుకోటం ఉన్నప్పటికీ ఈనాడిది వ్యక్తి కృషి. వీరు సంఘంగా ఏర్పడవలసిన అవసరం సాహిత్య సృజనకి తప్పనిసరి కాదు. అలా ఏర్పడటం ద్వారా సృజనకి ఒక ఉమ్మడి లక్ష్యం నిర్దేశించుకోటం జరగవచ్చు. అది రాజకీయ లక్ష్యం కావటం హెచ్చు. ఈ వ్యక్తిగత సృజనలో సమాజం ఉంటుంది. సమూహాలు ఉంటాయి. మనుషులు పడే రకరకాల కష్టాలు ఉంటాయి. వాటి ఉమ్మడి స్వభా వం, వాటికి ఉమ్మడి పరిష్కారం ఉండవచ్చు. అయినా వీరు వ్యక్తులే. చైతన్య స్థాయిలో, ఆచరణలో వీరికీ వారికీ నడుమ తేడా ఉంటుంది. సాహిత్యకారులని వ్యక్తులుగా చూడటంలోని వెసులుబాటు హక్కుల కార్యకర్తలని చూడటానికి లేదు.
2. నాలుగవ అంశం పుట్టుకకి సంబంధించినది. సాహిత్యం పుట్టు క మానవ సమాజ పరిణామంలో తొలిదశకి చెందినది. హక్కుల ఉద్యమాలు (ఇప్పటి అర్ధంలో) ఇటీవలి కాలానికి చెందినవి. రెండూ సామాజిక పరిణామంలో భాగాలే. రెండూ అసహాయ మానవుడి పక్షానే మాటాడుతాయి (దాదాపు). రెండూ ఆయాకాలాల, సమాజాల సామాన్యుల అవసరాల నుంచే పుట్టాయి. అలాగే వర్గసమాజ దృష్టితో చూస్తే పాలక వర్గాల ఆనందాలకూ, అవసరాలకూ ఎంతోకొంత అనుగుణంగా సాహిత్యం మారటం మధ్యయుగాల వరకూ సాగింది. ఇప్పటి పాలకుల అవసరాల కోసమే (స్వేచ్ఛావిపణి కోసం) ఒకప్పుడు జరిగిన పోరాటాలే తొలి హక్కుల ఉద్యమాలు. తర్వాతనే సాహిత్యం వివిధ సమాజాలలో లేనివాళ్లూ- ఉన్నవాళ్లూ (బాలగోపాల్ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో జ్ఞానాధికారం ఉన్నవాళ్లూ- లేనివాళ్లు, ప్రాశ్చాత్య దేశాలలో పౌర హక్కులు ఉన్నవాళ్లూ-లేనివాళ్లు) మధ్య ఘర్షణను పట్టించుకుంది.
3. నాలుగవ అంశంలోనే మరొక భాగం హక్కుల ఉద్యమాల వ్యాప్తి. ఎదుగుదలకి సంబంధించినది. కార్యకర్తల ఉద్యమ అనుభవాలు దాని అవగాహనని పెంచుతాయని బాలగోపాల్ చెపుతారు. అంటే ఉద్యమ కార్యాచరణలో కొత్త ప్రశ్నలు ఎదురవుతాయి. వాటిని లెక్కలోకి తీసుకుంటూ హక్కుల ఉద్యమ లక్ష్యాలను సవరించుకుం టూ ముందుకు సాగాలి. ఇది ఉద్యమాలన్నింటి పట్లా ఉండే సాధారణ అవగాహన. ఆచరణకి సిద్ధాంతం కన్న తొలి స్థానం ఇవ్వటం. అది అన్ని వేళలా ఎదుగుదల అవుతుందా- అప్పటికి నిర్ణాయక స్థానంలో ఉన్నవారి సమన్వయ శక్తి, అవగాహనా సామర్థ్యం పాత్ర ఏమిటి? చారిత్రకంగా ఫలితాలను బట్టే తరవాతి తరాల వారు ఉత్థా న పతనాలుగా విభజిస్తారు గదా?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నా యి. అయినా మానవునికి అది తప్ప మార్గంలేదు. ఇంక సాహిత్యా న్ని గురించి ఆలోచిస్తే దాని ఎదుగుదలని హక్కుల ఉద్యమం ఎదుగుదలతో సరితూచటం సాధ్యం కాదు. మానవ సమాజ ఉమ్మడి అవగాహనని సాహిత్యంలోంచి చూడవచ్చుగాని సాహిత్యకారులు ఉమ్మడిగా చేయగలిగింది చాలా స్వల్పం.
4. మార్క్సిస్టు తాత్విక, రాజకీయ, ఆర్థిక చింతనలకి సంబంధించిన అంశం ఆరవది. ఇది వర్తమా న హక్కుల ఉద్యమాల జీవన్మరణ సమస్య. సాహిత్యానికి సంబంధించి ఇది ఆధునిక సాహిత్యాన్ని గట్టి గా ప్రభావితం చేసిన అంశం మాత్రమే. సాహిత్యం ఎవరు అంగీకరించినా మానినా అన్ని రకాల వాదనలనూ, దుఃఖాలనూ, ఆవేశాలనూ పంచుకునే ఉమ్మడి వేదిక. సమాజంలోని అనేకానేక ఘటనలకు వ్యక్తుల ప్రతిస్పందన. పోతే బాలగోపాల్ ఈ అంశం గురించి చాలా చర్చించారు. ఆయన మరిం త కాలం ఉంటే, ఉన్నపుడు మరింత సమయం వెచ్చించి ఉంటే మార్క్సిస్టు రాజకీయ చింతనకు ఒక సమగ్ర తాత్వికతని, అవగాహనని సమకూర్చగలిగేవారని నాకు అనిపిస్తుంది. ఈ విషయం గురిం చి ఆయన పదేపదే మాటలాడవలసిరావటం హక్కుల ఉద్యమానికి ఈ అంశానికి గల విడదీయరాని సంబంధాన్ని తెలియబరుస్తుంది.
బాలగోపాల్ హక్కుల తాత్వికత నుంచి సాహిత్యకారులు నేర్చుకోవలసింది ఏమిటి?
1.తత్వశాస్త్రం చేయవలసిన పని ప్రపంచ వివరణ మాత్రమే కాదు, సవరణ కూడా అంటారు మార్క్సు. ఈ వ్యాఖ్య ప్రపంచ గమనంలో ఒక విభజన బిందువుగా చాలామంది భావిస్తారు. ఆయనకి ముందు తత్వశాస్త్రాలు సవరణకి ప్రయత్నించలేదా ఆ తర్వాత వివరణతో ఆగిపోలేదా అని ప్రశ్నించుకోవచ్చు. కాని మార్క్సుకి ముందు సవరణ దృష్టాంతాలు అప్రయత్నంగా జరిగాయాయని, ఆ తర్వాత వివరణతో ఆగిపోవటాలు ప్రయత్న పూర్వకంగా జరిగాయని మనం గమనించవచ్చు. బాలగోపాల్ గొప్ప చైతన్యంతో చేసిన వివరణలూ ప్రయత్నించిన సవరణలూ అదే కోవకి చెందిన సాహిత్యకారులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, చర్చించాలనీ నా ఆశ. అప్పుడు సృజన, విమర్శ అంగాల ద్వారా బలం సంతరించుకుని సమాజ గమనంలో క్రియాశీల పాత్ర వహించగలదు సాహిత్యం.
ఇప్పటితో పోలిస్తే మార్క్సునాటికి సమాచార సేకరణ, విస్తరణ ఎంతో కష్టసాధ్యం. అయినా ఆయన కృషి ‘ప్రపంచ మానవాళి’ అన్న తాత్విక దృష్టిని ప్రవేశపెట్టగలిగింది. ఈ దృష్టితో ప్రభావితమైన సాహిత్యం మానవుడిని కేంద్రంగా చేసుకుంది. తెలుగు సాహిత్యంలో కూడా ఈ తాత్విక దృష్టిని చాలావరకూ ప్రధానం చేసుకుంది. ఈ పరిధిలోనే వెలువడిన సాహిత్యం అనేక సమూహాలతో నిండిన మన సమాజంలోని అన్ని సమూహాలనూ స్పృశించలేకపోయింది. మన సాహిత్యంలో వివిధ సమూహాల స్వయం వ్యక్తీకరణ ఆరంభమైంది. దానితో భారత దేశపు ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం అవసరం సమాజ హితైషులు గుర్తించారు. ఆ దిశలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసిన బాలగోపాల్ మన సాహిత్య రంగంలోని అనేక ప్రశ్నలకు జవాబు వెతకటంలో ఉపయోగపడతారు.
2. హక్కుల పోరాట చరిత్రకి సంబంధించిన మొదటి అంశం జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం. మనమున్న ప్రస్తుత స్థితి దానికదే ప్రత్యేకంగా కాంక్షించదగ్గ స్థితి అని మనకు బాలగోపాల్ చెపుతారు. ఇది సాహిత్యానికి సంబంధించి కూడా ప్రధానమైనది. హక్కు ల విషయమే తీసుకుంటే మానవజాతిలో భాగంగా మనం కూడా పోరాటాలలో భాగమని చెప్పుకోవచ్చు. కాని ఓ దేశంగా గాని, జాతి గా గాని తీసుకున్నట్లయితే మనకీనాడు ఉన్న హక్కులలో అధికభాగం వలస పాలకులు వారి పాలిత దేశాలలో పాలితులకి అనువర్తింపజేయటం వల్ల లభించాయి. అంతేకాక వలస పాలనకు ముం దున్న వ్యవస్థలోని అనేక అవాంఛిత అంశాలు మన దేశస్తుల హక్కులలో భాగాలే. సతి, బాల్యవివాహాలు, విధవా వివాహాలు, అస్పృశ్యత వంటివి ఆచరించటానికి గల అధికారం ‘హక్కు’గానే చెలామణీ అయ్యేది. వీటిని నేరంగా మార్చిన చట్టాలు వలస పాలనలోనే పుట్టి ఆ హక్కులను తొలగింపజేసాయి.
ఈ విధంగా పరిశీలిస్తే పోగొట్టుకోవలసిన కొన్ని హక్కులను పౌరులు పోగొట్టుకోటానికి, వ్యక్తులుగా సమూహాలుగా కొన్ని హక్కులను పొందటానికీ ప్రత్యక్ష కారణం వలస పాలనే. అలాగే ఆధునిక సాహిత్యం అని మనం గుర్తిస్తున్నది ఇక్కడి సాహిత్య పరిణామక్రమంలో రూపొందినది కాదు. దీనిని మానవ జాతి పరిణామంలో భాగమని అనవచ్చు. ఆధునిక పూర్వ సాహిత్యంలో మన శిష్ట సాహిత్య లక్ష్యాలు నీతిబోధ, భగవద్భక్తి ప్రేరణ, సంపన్నుల, విద్వాంసుల మనోల్లాసం, స్వీయానందం, స్వీయ ముక్తి వంటివి. జానపదుల సాహిత్యం వేరని దాని లక్ష్యాలు వేరని అవి శిష్టసాహిత్యం కన్న ప్రజాహితంలోనూ, వినియోగంలోనూ ముందున్నాయనీ నేడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ రెండు సాహిత్యాలలోనూ సామాజిక సంస్కరణ, స్వీయ వ్యక్తీకరణ, భావాల కలబోత, పాఠకుని చైతన్యం పెంచటం వంటివి నేటి లక్ష్యా లు. ఈ మార్పుకి సైతం వలసపాలన ప్రభావం ఉంది. ఈ మార్పు వాంఛనీయమైనదే. దానాదీనా బాలగోపాల్ చెపుతున్నట్లు వర్తమాన స్థితిపట్ల సాహిత్యకారునికి చిన్నచూపు తగదు.
3. ఉన్న హక్కులు కాపాడుకోటం ఎంత అవసరమో అంతే అవసరమైనది కావలసిన హక్కులు గుర్తించి సాధించటం రెండవ అంశం. ఇది సాహిత్యకారులకి మరో ప్రధానాంశం. గతంలోని సామాజిక దౌష్ట్యాన్ని అనేక కోణాలనుంచి విశ్లేషించటం ఎంటువంటి సాహిత్య కర్తవ్యమో, వర్తమాన స్థితిని లోతుగా పరిశీలించటం అంతే అవస రం. మన దేశానికి పట్టిన దీర్ఘకాలిక వ్యాధి బ్రాహ్మణీయ భావజా లం. ఇది ఒకరకంగా ఒక ఆధిపత్యకులం ప్రవేశపెట్టినదన్న ఆలోచన సులువుగా కలుగుతుంది. ఎవరైనా అలా వివరిస్తే సులువుగా నమ్మగలుగుతాం. ఉమ్మడి సంప్రదాయాలతో రూపొందిన సమూహాలను ఉమ్మడి నామంతో గుర్తుపట్టటం మానవజాతి ఉమ్మడి లక్షణం. వాటి ని తెగలు, జాతులు, కులాలు అనటం చరిత్రలో గమనించవచ్చు. అలాంటి ఉమ్మడి నామంతో సమిష్టి ప్రయోజనాల పేరిట వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోటమే ఈ బ్రాహ్మణ భావజాలానికి వెన్నెముక.
ఈ భావజాలం చేసినంత ఛిద్రం మన సమాజాన్ని మరేదీ చేయలేదు. వర్తమానంలో ఇది తీసుకుంటున్న రూపం గుర్తుపట్టటానికి వీలులేనంత లోతైనది. ఇది వ్యక్తి అంతరంగంలో తిష్టవేసుకున్న తీరు చాలా బలమైనది. వ్యక్తులుగా మన అంతరంగాలను పరిశీలించుకుని అనుక్షణం అప్రమత్తతతో మనని మనం కాపాడుకుంటే తప్ప ఈ భావజాల విషవలయం నుంచి బయటపడలేం. మనవాళ్లు బయటపడేందుకు తోడుపడలేం. సాహిత్యకారులుగా మనిషి అంతరంగం మీద ప్రభావం కనపరచగల రంగంలో పనిచేస్తున్న మనం నేను, నా రచన వంటి ప్రలోభాలను వదులుకుంటే తప్ప ఆధిక్యతా భావన తాలూకు నకారాత్మక ప్రభావానికి లోనవుతాం.
ఇదే బ్రాహ్మణ భావజాలపు మాయ. ఆ మాయలో వర్తమాన స్థితిని లోతుగా పరిశీలించటమనే అవసరాన్ని నెరవేర్చలేం. 4. హక్కుల ఉద్యమాలలాగే మన సాహిత్యమూ వామపక్ష ఉద్యమాలతోసహా అనేక రాజకీయఉద్యమా లనుంచే ప్రేరణ పొందుతోంది.ఈ ఉద్యమ రాజకీయలక్ష్యాలకు ప్రచా రంగానే మిగిలిపోరాదని బాలగోపాల్ అంటారు. ఇది సాహిత్యానికి మరింత వర్తిస్తుంది. కార్యకర్తలుగానే మిగిలిపోకుండా వ్యక్తిగత వివేచనకి పదును పెడితేనే ఆ సమాజానికీ, ఉద్యమాల దీర్ఘకాలిక లక్ష్యాలకీ సహాయపడిన వాళ్లమవుతాం. హక్కుల ఉద్యమ స్వతంత్రత గురించి బాలగోపాల్ నొక్కిచెప్పిన అంశాల నుంచి సాహిత్యకారులు గ్రహించవలసినది చాలా ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
- వివిన మూర్తి
(నేడు బాలగోపాల్ మూడవ వర్ధంతి)
హక్కుల సూర్యునికి అడవి పూల నివాళి
హక్కుల సూర్యునికి అడవి పూల నివాళి
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?Category=1&subCategory=7&ContentId=160620 (October 14th 2012).
హక్కు హక్కుగా స్వేచ్ఛగా ఉండాలి. అలాకాకుండా బలవంతుల కబంధ హస్తాల్లో ఆట వస్తువుగా ఉన్నంత కాలం చస్తూ బతుకుతూ, హక్కులకోసం నిత్యం పరితపించే ఆదివాసీలు, స్త్రీలు, దళితులు, బలహీనవర్గాల వారికి హక్కులు అనుభవించే వీలుండదు. వారు హక్కులు పొందాలంటే ‘హక్కు’ల గురించి తెలియాలి. తెలియాలంటే ఒక నిండు జీవితం అంకితం కావాలి. ఈ అవసరాన్ని గుర్తించిన అతికొద్ది మందిలో బాలగోపాల్ ఒకరు. ఆదివాసీల జీవనాధరాలైన అడవి, భూమి, నీరు వారి హక్కుగా ప్రచారం చేస్తూ.. జీవితకాలమంతాఉద్యమం కొనసాగించారు.
1987లో విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో పోలీసులు పెద్ద ఎత్తున గృహ దహానాలకు పాల్పడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ దాడిలో భాగమే. అన్నలకు ఆశ్రమిస్తున్నారనే అభియోగం మోపి 46 గ్రామాల్లో 638 గుడిసెలను తగులబెట్టి నిరాక్షిశయులను చేశారు. వీరు చేసిన నేరమల్లా అడవి మధ్య గుడిసెలు వేసుకొని ప్రభుత్వాల మీద ఆధారపడకుండా అడవినే నమ్ముకొని బతకడం. ఆదివాసీలు ఇలా బతకడం కూడా నేరమేమో! అనిపించేంత భయానక వాతావరణంలో ఉన్నప్పుడు బాలగోపాల్ పరామర్శించటం వారికి ఎం తో ధైర్యాన్ని నింపింది. కీకారణ్యంలో నుంచి జనారణ్యంలోకి న్యాయం కోసం అడుగులు వేయగల శక్తినిచ్చింది.‘ఇండియన్ పీపుల్స్ హూమన్ రైట్స్ కమిషన్’ ఏర్పాటు చేసి వారి ముంగిట న్యాయస్థానం రప్పించగల్గిన నికార్సైనా హక్కుల కార్యకర్త మన బాలగోపాల్. ముగ్గురు ఉన్నత న్యాయమూర్తులతో విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయించిన సాహసి.
2007 ఆగస్టు 20 న విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లికి చెందిన పదకొండు మంది ఆదివాసీ మహిళలపై కూంబింగ్‌కు వెళ్ళిన పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. సాక్ష్యాధారాలను మా యం చేసి బాధితులనే నిందితులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఇంతటి దుర్మార్గానికి బాధ్యులైన గ్రే హౌండ్స్‌ను ‘బాధితులు’ అన్నది ప్రభుత్వం! బాధిత మహిళలను మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేశారు. పోలీసులు అధికారులు కుమ్మకై వారి మానాలకు ఐదు లక్షలు వెలకట్టి కొనాలని చూశారు. అయినా బాధితులు ఆ డబ్బు తిరస్కరించడంతో, మహిళలకు సంఘీభావంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని నిర్మూలించే పనిలోపడ్డారు. అయినా మహిళలు ‘ఆత్మగౌరవం చంపుకొని బతకలేమని ఆత్మ బలిదానికి సిద్ధపడ్డారు. పిల్లపాపలతో పాడేరు వచ్చి ఎనిమిదిరోజులు నిరహారదీక్ష చేశారు.ఎన్నో ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్న ఉద్యమానికి బాలగోపాల్ బాసటగా నిలిచారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూనే న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. సాక్ష్యాధారాలు లేవని జిల్లా కోర్టు కొట్టేసింది. ఆదివాసీ మహిళల ఆవేదనలో నిజముందని గ్రహించిన బాలగోపాల్ కేసును రీఒపెన్ చేయాలని బాధిత మహిళల తరుఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళల ఆత్మగోస న్యాయస్థానానికి వినిపించే సమయం వచ్చేనాటికి అక్టోబర్ 8 ఆ హక్కుల గొంతు ఆగిపోయింది. ఆయన అనుకున్న విధంగా బాధితులకు అనుకూలంగా కేసును తిరిగి కొనసాగించాలని తీర్పు వచ్చింది. పాలకుల ఉక్కు పిడికిలిలో నలిగిపోయి నిరాకరించబడ్డ న్యాయం నిందితులను కాపాడుతూ వస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో ఆయన లేని లోటు స్పష్టంగా కనబడుతున్నది.
-రామారావు దొర, ఆదివాసీ రచయితల సంఘం
(బాలగోపాల్ మూడవ వర్ధంతి సందర్భంగా..)
Human Nature and Marxism – Prof. Haragopal
Professor Haragopal inauguration speech on at Balagopal Commemorative Meet on October 7th 2012, on the occasion of the release of K.Balagopal’s book titled ”Manishi & Marxism”.
బాలగోపాల్ యాదిలో…. హక్కుల సదస్సు, అక్టోబర్ 7 2012 , హైదరాబాద్
హక్కుల సదస్సు, అక్టోబర్ 7 2012 , హైదరాబాద్
Seminar Hall, Bharatiya Vidya Bhavan, King Koti, Hyderbad
October 7th 2012, 10am- 5 pm.
బాలగోపాల్ మనందరికీ దూరమై మూడేళ్లు అయ్యింది.
ఈ మూడేళ్లలో రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆయన్ని మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ఆకాంక్ష అన్ని విధాలా న్యాయమైనదని ప్రకటించిన వ్యక్తి ఎన్నేళ్ళయినా పరిష్కార దిశగా అంగుళం ముందుకు కదలని ఆ ఉద్యమం గురించి ఏ పరిష్కారాలను సూచించేవారో, హక్కుల ఉద్యమం కారంచేడు, నుంచి ఎంతో నేర్చుకుందని పదే పదే చెప్పిన వ్యక్తి నాలుగు నెలలు గడిచినా లక్షింపేట దళితుల ఊచకోతపై చార్జిషీటు దాఖలు చేయని పోలీసులకు ఎన్ని రాజ్యాంగ పాఠాలు నేర్పేవారో, రాబోయే కాలమంతా ఛత్తీస్‌గఢ్‌లో రక్తపు పారతాయి, దాన్ని నిలవరించడానికి ముందుకు రండి అని 2006లోనే మేధావులను క్రియాశీలుల్ని చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. వాన్‌పిక్ తదితర ప్రాజెక్టుల్లో అందరూ కేవలం స్కాంలనే చూస్తుంటే వాటి వెనుక పొంచి ఉన్న విధ్వంసక అభివృద్ధి మహమ్మారి గురించి ఎన్ని విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి ఉండేవారో, మళ్ళీ మొదలైన రైతుల ఆత్మహత్యలు, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆగిపోయిన వాకపల్లి రేప్ కేసు, చమురు వెలికితీత వల్ల కుంగిపోతున్న గోదావరి డెల్టా.. ఇలా హక్కు ల ఉద్యమం తన సామర్థ్యాన్ని పనితనాన్ని నిరూపించుకోవాల్సిన వచ్చి న ప్రతి సందర్భం ఆయనను గుర్తు చేసింది. సాధించిన కొద్దిపాటి విజయాల్లో బాలగోపాల్ గుర్తులను వెతుక్కుంటూ ముందుకు సాగడమొక్కటే మేము ఆయనకు ఇవ్వగల నివాళి.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, హైదరాబాద్ కింగ్ కోఠిలోని నిజాం కాలేజీ పక్కన ఉన్న భారతీయ విద్యాభవన్‌లోని సెమినార్ హాల్‌లో ‘బాలగోపాల్ యాదిలో’ హక్కుల సదస్సు జరుగుతుంది.
మొదటగా ‘బాలగోపాల్ – హక్కుల ఉద్యమం’ అంశంపై ఎ. చంద్రశేఖర్,
అనంతరం ‘ప్రపంచీకరణ – జీవ వైవిధ్యం – ప్రత్యామ్నాయాలు’ అంశంపై పర్యావరణ వేత్త అశిష్ కొఠారి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం ‘అణువిద్యుత్ – కూడంకుళం పోరాటం’ అంశంపై సామాజిక కార్యకర్త ‘నిత్యానంద్ జయరామన్’,
తదనంతరం ‘సామాజిక న్యాయంలో చట్టం పాత్ర’ అంశంపై సుప్రీంకోర్టు న్యాయవాది నిత్యా రామకృష్ణన్ ప్రసంగిస్తారు.
ఈ సదస్సులో బాలగోపాల్ రాసిన ‘Of Capital And Other Punishments’, ‘మనిషి మార్క్సిజం’ పుస్తకావిష్కరణలు జరుగుతాయి.
- మానవ హక్కుల వేదిక
Ear To The Ground
Selected Writings on Caste and Class by Balagopal from 1982 thru 2009. (Listed as one of the memorable books published in 2011, Biblio Nov/Dec 2011).
Published by Navayana Publications. Buy online from Flipkart and Scholars Without Borders. Available at all leading bookstores.
Book Reviews:
An Ethical Compass – Anant Maringanti, Biblio, January – Febuary, 2012.
Book Summary of Ear To The Ground: Writings On Class And Caste
As a human rights worker active since 1981, and slightly older than Balagopal, I remember him as a magical figure. The writings in this volume help interpret the often chaotic developments in Andhra Pradesh, and provide a model tool for understanding other regional realities of India.’
—BINAYAK SEN
Balagopal’s writings, from the early 1980s till he died in 2009, offer us a rare insight into the making of modern India. Civil rights work provided Balagopal the cause and context to engage with history, the public sphere and political change. He wrote through nearly three tumultuous decades: on encounter deaths; struggles of agricultural labourers; the shifting dynamics of class and caste in the 1980s and thereafter in Andhra Pradesh; the venality and tyranny of the Indian state; on the importance of re-figuring the caste order as one that denied the right of civil existence to vast numbers of its constituents; the centrality one ought to grant patriarchy in considerations of social injustice; the destructive logic of development that emerged in the India of the 1990s, dishonouring its citizens’ right to life, liberty and livelihood. This volume comprises essays—largely drawn from Economic & Political Weekly to which he was a regular contributor—that deal with representations and practices of class power as they exist in tandem with state authority and caste identities.
Inspired by naxalism in the late 1970s, intellectually indebted to D.D. Kosambi’s writings on Indian history and society, and politically and ethically attentive to the politics of feminist and dalit assertion in the 1990s, Balagopal refused dogma and shrill polemics just as he refused theory that did not heed the mess of history and practice.
Balagopal was too self-effacing to put together his writings into a volume. But it is through his writings that his legacy lives on, giving us a roadmap for future struggles.
Excerpt:
‘There is perhaps no issue on which we are such hypocrites as caste; nor any other which brings out all that is worst in us with such shameful ease. The moment V.P. Singh announces the decision to implement the Mandal Commission recommendations… an avalanche of obscenity hits the country. Caste will undoubtedly be the last of the iniquitous institutions to die out in this country. It will outlast everything else.’—Economic & Political Weekly, 6 October 1990
About the Author:
Kandala Balagopal (1952–2009) did not start out as a writer or commentator on contemporary politics. Like that other great modern Indian thinker, D.D. Kosambi, whom he read avidly, admired and wrote about, his training was in mathematics, a subject he taught at Kakatiya University, Warangal, from 1981 to 1985. The political culture of Warangal—home to the naxalite left and resonant with debates around questions of class, justice and revolution—proved decisive in Balagopal turning away from an introspective life of the mind. Instead, he came to train his acute intellect to identify, comprehend and critically examine key political and social concerns. He joined the Andhra Pradesh Civil Liberties Committee in 1981, and became active in civil rights work centred at that time around extra-judicial killings of militant left cadres. Arrested under TADA in 1985 on trumped-up charges relating to the murder of a police sub-inspector, he spent three months in Warangal prison. In 1989, Balagopal was kidnapped by a vigilante group called ‘Praja Bandhu’—believed to be a front of the police, and in 1992 was beaten up badly by the police in Kothagudem.
Balagopal trained to be a lawyer late in his life and enrolled in the Bar Council of Andhra Pradesh in 1998, representing a wide variety of litigants whose lives, lands, status and employment were threatened. In fellow-traveller K.G. Kannabiran’s words, ‘Balagopal showed himself as the only lawyer of the poor of his generation with a reputation for competence.’ Owing to differences of opinion on the use of violence by naxalites, Balagopal left APCLC in 1998. He was one of the founder-members of Human Rights Forum in which he was active till his death.
దళిత – కె. బాలగోపాల్
దళిత , పరస్పెక్టివ్స్ , హైదరాబాద్ 2011.
వివిధ సందర్భాల్లో బాలగోపాల్ కుల సమస్యపై వ్రాసిన వ్యాసాలు, రిపోర్ట్లు, వ్యాఖ్యానాలు.
Balagopal essays, reports and commentary in Telugu on caste related issues from 1985 thru 2009.
నమస్తే తెలంగాణా, 11 డిసెంబర్ 2011 దిన పత్రిక లో పుస్తక సమీక్ష
రాజ్యం – సంక్షేమం, బాలగోపాల్ ఉపన్యాసాలు
హక్కుల ఉద్యమం – తాత్విక దృక్పధం
రూపం – సారం, సాహిత్యం ఫై బాలగోపాల్
మా బాలగోపాల్ – మానవ హక్కుల వేదిక బులెటిన్, 2010
సైన్సు గురించి రాజకీయంగా ఆలోచించడం నేర్చుకోవాలి – బాలగోపాల్
మత తత్త్వం ఫై బాలగోపాల్
మత తత్త్వం ఫై బాలగోపాల్
ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్, అక్టోబర్ 2010.
ఈ సంకలనం లో వ్యాసాలను ఈ క్రింది మూడు విభాగాలుగా సమకూర్చారు.
1 హిందూ ధర్మం – ప్రజాస్వామ్యం
2 హిందుత్వం – విద్య
3 మైనారిటీలు – సంఘ్ పరివార్
A collection of Balagopal essays, published by Hyderabad Book Trust, Hyderabad on Hindutva on topics related to,
Hindu Dharma and Democracy
Hindutva and Education
Minorities and Hindtuva.
నిగాహ్ – బాలగోపాల్ వ్యాసాలు, ప్రజా తంత్ర , 1998-2003
నిగాహ్’ – ప్రజాతంత్ర పత్రికలో బాలగోపాల్ వ్యాసాలు 1998-2003.
ఇండియా టుడే, డిసెంబర్ 2011 లో పుస్తక సమీక్ష
Balagopal Commemoration: Prof G Haragopal
On the occasion of first year anniversary of Balagopal’s demise and the commemoration meeting held on October 8th, 2010 in Dallas,Texas – Prof G Haragopal remembers Balagopal.
(Courtesy: www.prajakala.org)
Balagopal Commemoration: S. Jeevan Kumar, HRF
On the occasion of first year anniversary of Balagopal’s demise and the commemoration meeting held on October 8th, 2010 in Dallas,Texas – Sri S Jeevan Kumar, President, HRF talks about his more than thirty years of association with Balagopal, his contribution to the human rights movement, emphasising that only way to respect and remember Balagopal is continue his work in HRF. (Courtesy: www.prajakala.org)







