Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

Archive for the ‘Andhra Jyothy’ Category

శ్రీలంక తమిళుల భవిష్యత్తేమిటి?

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

గడచిన ఆరు నెలలలో శ్రీలంకలో జరిగిన ఘటనలకు భారతదేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలంకకు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడ వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే రాబోయే దినాలలో ఈ స్పందన అవసరం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తప్పొప్పుకోవడమే కాదు, సవరించుకునే అవకాశమూ ఉంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:26 pm

భావజాల శృంఖలాలలో న్యాయ వ్యవస్థ

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

రెండు దశాబ్దాల కింద కేరళ రాష్ట్రం నుంచి ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. వేసినవారు ముగ్గురు విద్యార్థులు. వాళ్ల స్కూలు వాళ్లను బర్తరఫ్‌ చేసిందని వాళ్లు కోర్టు కు వెళ్లారు. ఎందుకు బర్తరఫ్‌ చేసిందంటే వాళ్లు జాతీయగీతం ఆలపించడానికి నిరాకరించారని. ఎందుకు నిరాకరించారంటే దేశభక్తి అనేది కొరవడటం వల్ల కాదు. వాళ్లు ఆచరించే క్రైస్తవ మతశాఖ దేవుడిని తప్ప మరెవరినీ స్తోత్రం చేయవద్దని చెప్తుందట. అందువల్ల ఈ పిల్లలు స్కూలులో ‘ప్రేయర్‌’ జరిగే సమయంలో అందరితో బాటు లేచి నిలబడతారు. వినయంగా తలదించుకుంటారు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:23 pm

గంగవరం పోర్టు కథ కాల్పుల దాకా ఎట్లా వచ్చిందంటే….

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

గంగవరం ఘటన కిందటి సంవత్సరంలోనే జరగవలసి ఉండిం దంటే అభ్యంతరకరంగా తోస్తుందేమో. కానీ అది నిజం. ‘గంగవరం రేవు’ నిర్మించబోయే దిబ్బపాలెం తీరం వద్ద చేప లవేటమొత్తం వారంరోజులలోగా ఆగిపోవాలని విశాఖ పట్నం ఆర్‌డివో దొరవారు గత జులై 30న తాఖీదు జారీ చేశారు. ఈ రోజు చట్టాన్ని ధిక్కరించారన్న నింద ఎదుర్కొంటున్న మత్స్య కారులు ఆరోజే ఆ పనిచేసి ఉంటే మొన్నటి యుద్ధం 9 నెలల కిందే జరిగి ఉం డేది. ఆ రోజు వారు చట్టాన్ని గౌరవించారు. హైకోర్టులో కేసు వేశారు. ఒకటి కాదు, రెండు కేసులు వేశారు. ప్రభుత్వం తనంతట తానే ఆర్‌డివో తాఖీ దును అమలుచేయబోమనీ నిర్వాసితులను సంప్రదించి వారికి పునరావాస పథకం రూపొందించిన తరువాతే దిబ్బ పాలెం తీరం వద్దనున్న మత్స్యకా రుల పడవులను తొలగిస్తామనీ హైకోర్టుకు హామీ యిచ్చింది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:21 pm

అదే పాలన, అదే విధ్వంసం

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

ఓటర్ల విజ్ఞతను ప్రశ్నించకూడదనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమైన మర్యాద. ‘ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను’ అని ఓడిపోయిన అభ్యర్థులు అంటుంటారు. శిరసావహించక వాళ్లు చేయగలిగింది లేదుగానీ, ‘నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు’ అన డం కొంచెం వికారంగా ఉండే మాటా వాస్తవమే. అయితే ఈ మర్యాదకు అంతకంటే అర్థమూ లేదు. వోటర్లుగా ప్రజలు తీసుకున్న నిర్ణయం రైతులుగానో కార్మికులుగానో విద్యార్థుల తల్లిదండ్రులుగానో మరొక అవతారంలోనో వారి శ్రేయస్సు కు నష్టకరమయితే ఆ మాట అనకుండ ఉండవలసిన అవసరం లేదు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:17 pm

సజీవంగా ఉన్న ముఠాతత్వం

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

ముఠా కక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడచిపోయిన విషయాన్ని అనవసరంగా పదే పదే తవ్వితీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నా రు. ప్రతీ హత్యనూ ఫాక్షన్‌ హత్యగా ప్రతీ కొట్లాటనూ ఫాక్షన్‌ కొట్లాటగా వర్ణించే మీడియా అజ్ఞానం కూడ దీనికి దోహదం చేసింది. ఫాక్షన్లు ఇప్పటికీ ఉన్నాయా అంటే మనం దానికి ఇచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:13 pm

ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?

without comments

-కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)
ఒక వారం దినాలుగా వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ‘మహాకూటమి’ గెలిస్తే రాయలసీమకూ కోస్తాంధ్రకూ నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిలిచిపోతాయనీ ఆ ప్రాంతాలవారు హైదరాబాద్‌లో మనుగడ సాగించలేరనీ ఇప్పటికే వారినక్కడ పరాయివారిగా ఎంచి దాడులు చేస్తున్నారనీ రెండవ విడత ఎన్నికలు జరగవలసి ఉన్న ప్రాంతాలలో ఉపన్యసిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం చాలా న్యాయంగానే వ్యతిరేకతకూ విమర్శకూ దారి తీసింది.ద్వేషం రెచ్చగొట్టడంలోని అనౌచిత్యాన్ని అటుంచి ఈ వ్యాఖ్యలు అబద్ధాలు కూడ. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతాలలో సహితం బయటివారు క్షేమంగా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. 1969 మాటేమోగానీ ప్రస్తుత తెలంగాణ ఉద్యమమంతటి సౌమ్యమయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని దేశం ఇప్పటిదాకా చూసి ఉండదు. ఆ సౌమ్యత వల్లనే నష్టపోయామన్న భావన తెలంగాణ వాదులను ఒక పక్క బాధపెడుతుండగా అది లేదని అనడం పుండుమీద కారం జల్లడమే. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:10 pm

అభివృద్ధి పిడికిలిలో చిన్నజనం

with 2 comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

సెజ్‌ల కోసం, గనుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో చేపడుతున్న భూసేకరణ వల్ల జీవనం కోల్పోతున్నవారికి ఆ భూసేకరణను, విచ్చలవిడి పారిశ్రామికీకరణను, వ్యతిరేకించమని చెప్తున్న ఉద్యమకారులు ఆ ప్రజలకు మేలు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఎదుగూ బొదుగూలేని గ్రామీణ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని పట్టణాలలో మెరుగయిన జీవితాన్ని వెతుక్కునే అవకాశానికి అడ్డుపడుతున్నారా? ఒక్కొక్క ఉదంతాన్నీ తీసుకొని నిర్దిష్టంగా బేరీజు వేసినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:07 pm

కరువుకూ, పోలవరానికీ సంబంధం ఏమిటో…!

without comments

- కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

‘వివిధ కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న’ వారిలో మేము కూడ ఉన్నాము కాబట్టి, వేములపల్లి వెంకట్రామయ్య రాసిన వ్యాసాని(జన వరి 6,ఆంధ్రజ్యోతి)కి జవాబు రాయడం అవసరమని భావిస్తున్నాను. గోదా వరి జలాలలో మన రాష్ట్రానికి కేటాయించిన వాటాలో 700 టిఎంసిలు (680 అని నిపుణులఅంచనా) ఇంకా వినియోగంలోకి రాకుండా మిగిలే ఉందని ఆయన గుర్తించా రు. మన వాటాను వీలయిన మేరకు వాడుకోవటం అవసరమనే అనుకుందాం. దాని నుంచి పోలవరం ప్రాజెక్టు చేపట్టడం తప్పనిసరి అనే నిర్ధారణకు ఎందుకు రావాలి? ఆ నీళ్ళన్నీ పోలవరం దగ్గరనో, దానికి కొంచెం ఎగువనో గోదావరిలో వచ్చి చేరేటట్టయితే పోలవరం ప్రాజెక్టు ద్వారా తప్ప ఇంకొకరకంగా మన వాటాను వాడుకోవటం సాధ్యం కాదు. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 9:04 pm

ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పుడు?

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy).

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందుకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యా యం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తులమ య్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. ‘క్లాసికల్‌’ అనే పదాన్ని ప్రాచీనం అనే అర్థంలో తీసుకునేట్టయితే తమి ళం ప్రాచీనతను రుజువు చేయడానికి కుండ పెంకులూ, శిలా ఫలకాలూ వెతకనక్కర లేదు. తమిళుల సంస్క­ృతిలో ఇప్పటి కీ సజీవంగా ఉన్న రెండు వేల ఏళ్లనాటి సాహిత్యం ఉంది. Read the rest of this entry »

Written by chs

February 4th, 2010 at 8:59 pm

ఐక్యతే హక్కులకు రక్షణ

without comments

యస్‌.శేషయ్య (APCLC)  Source: Andhra Jyothy, November 11, 2009.

అభివృద్ధిపేరుతో జరుగుతున్న విస్తాపన, విధ్వంసం, హిందూ మతోన్మాదం పెరిగి మైనారిటి మతస్తులపై ఊచకోత, ఉగ్రవాదం పేరుతో హక్కుల ఉల్లంఘన, తీవ్రవాదం పెనుప్రమాదం అని చెప్తూ ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో ఆదీవాసీలపై చేస్తున్న యుద్ధం, అన్నీ కూడా హక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదు. హక్కుల సంఘాలు కలిసి ఐక్యంగానే హక్కులను కాపాడుకోగలుగుతాం. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగతాం.

బాలగోపాల్‌ ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమకారులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. బాలగోపాల్‌ ‘ఇక లేడు’ అనే నిస్పృహతోపాటు, ‘పౌరసమాజం’ ఒక రకమైన భయానికి, వెలితికి లోనయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ, ఈ పరిస్థితి తాత్కాలికమే. పురుషోత్తం, ఆజం అలీలను సర్కారీ హంతకముఠాలు కిరాతకంగా హత్య చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. పౌరహక్కుల సంఘం ఇక పనిచేస్తుందా? అనే సంశయం, సందేహాలు ఏర్పడ్డాయి. బాలగోపాల్‌ ఆ సందర్భంలో ‘నిస్పృహను, నిస్సహాయతను అధిగమించడానికి కావల్సిన దృఢ సంకల్పం, మానసిక స్థైర్యాన్ని పురుషోత్తం నుండి ఉద్యమాలు, ఉద్యమకారులు, ప్రజలు నేర్చుకోగలిగితే అతని మరణం వృధా కానట్టే’ అని ధైర్యాన్ని యిచ్చాడు. Read the rest of this entry »

Written by chs

November 13th, 2009 at 8:45 am

నిక్కచ్చిగా అంచనా వేద్దాం

without comments

దుడ్డు ప్రభాకర్‌
(వ్యాసకర్త కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు)

Source: Andhra Jyothy,  30th October, 2009).

దళిత, ఆదివాసీ, మహిళా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు జరుగుతున్నా యి. అవి ఏవీ జరగనట్టు హక్కుల ఉద్యమానికి ఆది-అంతం బాలగోపాలే అని వ్యాఖ్యానించడం ఆయన మనస్తత్వానికి పూర్తి వ్యతిరేకం. ఈ వింత పోకడ ఇప్పటి వరకూ పార్లమెంటరీ పార్టీల నాయకులు మరణించిన సందర్భాలలో కనిపిస్తూ ఉండేది. ఇంత వరకు ఏ ఉద్యమ కారుడు మరణించిన సందర్భంలో కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు వినలేదు. Read the rest of this entry »

Written by chs

November 12th, 2009 at 9:49 pm

పావన చరితుడు కె.బాలగోపాల్‌..

without comments

సి.ధర్మారావు ( Source: Andhra Jyothy, 30th October, 2009).

పావన చరితుల్ని గూర్చి ఎందరు ఎన్ని సంగతులు చెప్పినా, మళ్లీ మళ్లీ వినబుద్ధి అవుతుంది గదా. కె.బాలగోపాల్‌ గురించి అసంఖ్యాకంగా వస్తున్న రాతలు, కవితలు చూశాక నాకు సంబంధించిన ఒక చిన్న ఘటన కూడా నలుగురితో పంచుకోవాలనిపించింది. అది 1999 సంవత్సరం అని గుర్తు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం మా ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్లి తలుపు తీసి చూస్తే, ఎవరో పరిచయం లేని పెద్దమనిషి. ‘నేను కె. బాలగోపాల్‌ని’ అన్నారు. నేను సంభ్రమంగా-మీరు మా ఇంటికి రావటం అదృష్టం అని, లోపలికి ఆహ్వానించాను. కూచోబెట్టి మంచినీళ్లు తెచ్చిస్తే తాగారు.

నాకు అంతకు ముందు ఆయన్ని గుర్తుపట్టే పాటి పరిచయం లేకపోయినా, ఆయన ఎవరో, ఏమిటో నాకు చాలా వరకు తెలుసు. ‘ఇంట్లో ఎవరూ లేరు, అయినా నాకు టీ పెట్టడం వచ్చు, తీసుకుందురు గాని’ అన్నాను. ఈ లాంఛనం అసలు పట్టించుకోకుండానే-’నేను ఒక నోటిఫికేషను గురించి వచ్చాను. విశాఖ కోర్టులో గిరిజనుల కేసొకటి వాదిస్తున్నాను. ఆ రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్లెప్పు డూ వాళ్లకు జాబులు, నోటీసులు ఇంగ్లీషులో పంపిస్తుంటారు. వాటిల్లో ఏముందో వాళ్లకు చెప్పేవారు లేరు. అలాంటివన్నీ తెలుగులోనే పంపాలని ప్రభుత్వ ఉత్తర్వులుంటే, నాకు కొంత ఉపయోగం ఉంటుంది’ అన్నారు.

Read the rest of this entry »

Written by chs

November 12th, 2009 at 9:40 pm

నాకు ఎదురుచూపులే మిగిలాయి…

with one comment

గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్‌ (Source: Andhra Jyothy, November 1st, 2009).

ఈ మధ్యనే (08.10.2009) హఠాన్మరణం చెందిన మానవహక్కుల నేత కె.బాలగోపాల్‌తో పాటు హైస్కూల్లోనూ, ఆ తర్వాత డిగ్రీలోనూ దాదాపు ఐదారేళ్లు కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్‌. ప్రస్తుతం ఈయన కడప జిల్లా గ్రామీణబ్యాంకులో సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగ బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో బాలగోపాల్‌ జీవనశైలిని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అందిస్తున్న అక్షర నివాళి ఇది.

బాలగోపాల్‌తో ఐదారేళ్లు కలిసి నడిచిన అదృష్టవంతుణ్ణి నేను. తిరుపతిలోని ప్రకాశంపంతులు మున్సిపల్‌ హైస్కూలులో 8,9,10 తరగతులు కలిసి చదువుకొనే రోజుల్లో అతనితో సన్నిహితంగా ఉంటూ, ఇతర స్నేహితుల మధ్య నా స్థానం ప్రత్యేకమైనదిగా భావించేవాణ్ణి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవడిగా బాలగోపాల్‌, గౌరిపెద్ది రామసుబ్బశర్మ కుమారుడిగా నేను …అందరికీ తెలిసిన రెండు పండిత కుటుంబాల సాన్నిహిత్యం మాది. Read the rest of this entry »

Written by chs

November 7th, 2009 at 8:47 pm

ఈ కాలపు గాంధీ

without comments

- వెల్చాల కొండలరావు
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు, Source: Andhra Jyothy, October 27, 2009).

అరుదైన మనీషి, చాలా అరుదైన మేధావి బాలగోపాల్‌. అటువంటి వ్యక్తి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందని వారు, దుఃఖితులు కాని వారు ఎవరైనా ఉంటారా? మానవహక్కులకు పర్యాయపదం బాలగోపాల్‌. అన్ని హక్కులు మానవహక్కులలోనే సమ్మిళితమై ఉన్నాయని గ్రహించి వాటిని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమాలు విజయవంతం కావాలంటే, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలంటే ప్రజలకు వారి హక్కుల గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి. ‘ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలిస్తే వారే వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తారని’ బాలగోపాల్‌ విశ్వసించారు. Read the rest of this entry »

Written by chs

October 28th, 2009 at 4:08 pm

మనకాలపు పరిపూర్ణ మానవుడు

without comments

అల్లం నారాయణ

నిజానికి బాలగోపాల్‌ నిరాడంబరత, సంపూర్ణ మనిషిలాగా జీవించడం గురించి, నిర్భయత్వం గురించి మాట్లాడ్తున్నాం కానీ, అవి ఆయనకు తెలుగునాట జరిగిన కీలకమైన సామాజిక పరిణామాల సందర్భంలో సహజంగా ఏర్పడినవే. ఈ సందర్భాల్లో ఆయన నిండా ఉద్యమంతో మమేకమై ఉన్నందున…. గొప్ప ఆదర్శాలుగా ముందుకొచ్చిన అంశాలను ఆవాహన చేసుకున్నవే.

చివరి ప్రసంగంలో బాలగోపాల్‌ భయం గురించి మాట్లాడారు. సమాజంలో సర్వత్రా వ్యాపించిన భయం గురించి. ఈ భయానికి కారణమైన ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణం గురించీ మాట్లాడారు. ఈ భయం వల్ల హక్కుల కోసం ప్రశ్నించేవాళ్లు, అన్యాయాన్ని అన్యా యం అని చెప్పేవాళ్లు, సులభంగా అవకాశవాదం వేపు మళ్లుతున్న దుస్థితి గురించీ ప్రస్తావించారు. ఇప్పుడాయన లేరు. వారం రోజులుగా ఒక వెలితి ఏదో కమ్ముకున్నట్టుగా ఉంది. ఎక్కడో పూరించలేని ఒక లోటు కనపడ్తున్నది. Read the rest of this entry »

Written by chs

October 23rd, 2009 at 5:21 am