Archive for October, 2009
‘నేను వర్కహాలిక్‌ని’ – బాలగోపాల్
(Source: Andhra Prabha,

కె.బాలగోపాల్, కుమారుడు ప్రభాత, భార్య వసంతలక్ష్మి.
పౌరహక్కులు, మానవహక్కులు, పీడిత, తాడిత జనోద్ధరణ లాంటి ఆశయాలతో జన జీవన స్రవంతిలోకి వచ్చి, నిత్య పోరాట మార్గంలో నడవకపోతే ఆయన లెక్కల మాస్టారు అయ్యేవారు. అందరూ నడిచే దారిలోనే నడిస్తే ఎంతోమంది మేథమెటిక్స్ విద్యార్థులను ఆయన మహాపండితులను చేసేవారు. చదివింది మాథమెటిక్స్ అయినా, సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలు ఆయనకు ప్రీతి. బెర్ట్రాండ్ రసెల్ గ్రంథాలు చదవటం ద్వారా మార్క్సిజంపై ఆసక్తి పెంచుకొని, దాన్ని అధ్యయనం చేసిన మేధావి కె.బాలగోపాల్. ఒకప్పటి సోవియట్ యూనియన్ నుంచి ప్రచురితమయ్యే గ్రంథాలలో ఉన్నది మార్క్సిజానికి యాంత్రిక భాష్యం మాత్రమేనని, చారిత్రక వేత్త డి.డి.కోశాంబి రచనలే ఆ సిద్ధాంతానికి సమగ్రమైన, స్పష్టమైన వ్యాఖ్యానం చెప్పాయని ఆయన అంటారు. ఇంగ్లీషులో ‘వర్క్‌హాలిక్’ అనే పదానికి నిరంతరం ఏదో ఒక పని చేయటమనే అర్థం ఉందని, తాను ‘వర్క్‌హాలిక్’ అనీ ఆయన చెబుతారు. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న బాలగోపాల్, జీవిత విశేషాలను ‘ఆంధ్రప్రభ’ అడిగినప్పుడు, అనునిత్యం జనజీవనంలో గడిపే తనలాంటి వారికి వ్యక్తిగతమైనవేముంటాయని ప్రశ్నిస్తూనే, తన చిన్నప్పటి జీవనశైలి, ఆటపాటల పట్ల ఆసక్తి, ఉద్యోగం, పౌర హక్కుల ఉద్యమ విశేషాలు అన్నీ చెప్పుకొచ్చారు. Read the rest of this entry »
REMEMBERING BALAGOPAL: PUHR, CHENNAI -30th Oct, 5:30 pm
Venue: Book Point, Anna Saalai, Chennai
Date & Time: 30th October, 5.30 pm Read the rest of this entry »
Prajatantra Special Issue on Balagopal
Prajatantra Special Issue Remembering Balagopal (Oct 18-24,2009) – Part I
Prajatantra Special Issue Remembering Balagopal (Oct 18-24 2009) – Part II
Ideology and Adjudication: The Supreme Court and OBC Reservations
This was the last article written by Balagopal for EPW. It is available here in PDF:
జీవించవలసిన జ్ఞాపకం ఆయన, భిన్న వ్యక్తిత్వం ఆయన సొంతం
| అజ§్‌ు గుడవర్తి, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ |
| అక్టోబర్ 28-29, 2009 (Source: Vaartha) |
| మానవ హక్కుల వేదికకు పది సంవత్సరాలు నిండిన సందర్భంగా అటువంటి సంస్థను నిర్మిచడం ఎలా జరిగిందని బాలగోపాల్‌తో నా చివరి సంభాషణల్లో అడిగాను.సంస్థ నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకూ వ్యాపించిందిగాని, మొత్తంగానే ఆదర్శ వాదం వెనకపట్టు పడుతున్నదని ఆయన జవాబిచ్చారు.పోరాటాలను ప్రారంభించడానికి, కొనసాగించ డానికి ఒకరకమైన సంకోచం, అయిష్టం ఉన్నాయని ఆయన అన్నారు. తర్వాత కాస్త ఆలోచించి, బహుశా పోరాటాలు కొనసాగాలంటే ఎంతో కొంత అమాయకత్వం కూడా ఉండాలేమో అని కలిపారు. బాలగోపాల్ స్వయంగానే ఇటువంటి ఆమాయకత్వాన్ని, నిజాయితీతో సహా, కాపాడు కున్నట్టున్నారు. ఏదయినా ఒక విషయానికి తాను ఇవ్వ గలిగినదంతా ఇచ్చే అరుదయిన సాహసం ఆయన సొత్తు. ఆయితే అదే సమయంలో ఆ విషయం ఏమి కాబోతున్నదో కూడా ఆయన చాలా ఖచ్చితమైన అంచనా వేయగలిగేవారు. Read the rest of this entry » |
ఈ కాలపు గాంధీ
- వెల్చాల కొండలరావు
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు, Source: Andhra Jyothy, October 27, 2009).
అరుదైన మనీషి, చాలా అరుదైన మేధావి బాలగోపాల్. అటువంటి వ్యక్తి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందని వారు, దుఃఖితులు కాని వారు ఎవరైనా ఉంటారా? మానవహక్కులకు పర్యాయపదం బాలగోపాల్. అన్ని హక్కులు మానవహక్కులలోనే సమ్మిళితమై ఉన్నాయని గ్రహించి వాటిని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమాలు విజయవంతం కావాలంటే, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలంటే ప్రజలకు వారి హక్కుల గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి. ‘ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలిస్తే వారే వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తారని’ బాలగోపాల్ విశ్వసించారు. Read the rest of this entry »
ఆదివాసీలకు అడివంత అండ
| పల్లా త్రినాథరావు (Source: Vaartha, సొమ వారం, అక్టోబర్ 12, 2009 ). |
| ఆదివాసీల ఆత్మబంధువు బాలగోపాల్ ఇకలేరనే వార్త, ఆదివాసీ క్షేత్రాల్లో చీకటినినింపింది. దోపిడీ, హింస, దౌర్జన్యాలను నిరంతరం మౌనంగా భరించే ఆది వాసీలకు డాIIకె.బాలగోపాల్ కొండంత అండగా నిలిచిన వ్యక్తి. ఆనాటి నుండీ ఈనాటిదాకా చాలామంది అర్థం చేసు కోలేకపోతున్న ఒక విషయంమేమిటంటే పర్యావరణ సమతుల్యానికి కావలసింది అడవులుకాదు, చెట్లు. అంటే అటవీశాఖ యాజ మాన్యంలోని భూమిని కబ్జాదార్ల నుంచి, పోడు వ్యవసాయం చేసే ఆదివాసుల నుండి కాపాడి వనాలు పెంచటమే దానికి ఏకైక పరిష్కారమార్గంకాదు. Read the rest of this entry » |
Remembering Balagopal: A Feminist Pays Her Tribute To A Comrade
by Nandita Haksar (sacw.net)
My first introduction to Balagopal was as a brilliant mathematician with a doctorate from the Indian Statistical Institute. He was a lecturer at the Kakatiya University in Warangal, Andhra Pradesh. Balagopal had to leave his job at the Kakatiya University because there was a danger that he would be killed by the police because he had been taking up the cause of the Naxalites. Read the rest of this entry »
Tribute to Balagopal – Sung by Arunodhaya (Audio)
Tribute to Balagopal – Sung by Arunodhaya (Audio) (3.40 MB in mp3 format)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Kannabiran paying tribute to Balagopal (Audio)
Human rights movement become bereaved: MASUM
K. Balagopal was not a civil rights activist of Andhra Pradesh but a crusader against any human rights violation in this part of the globe. His untimely death saddened the whole HR community of this country and abroad. Balagopal died at relatively younger age of 52 due to a cardiac arrest in a hospital in Banjara hills on Thursday night. He is survived by wife and sonContinue Reading
మనకాలపు పరిపూర్ణ మానవుడు
అల్లం నారాయణ
నిజానికి బాలగోపాల్ నిరాడంబరత, సంపూర్ణ మనిషిలాగా జీవించడం గురించి, నిర్భయత్వం గురించి మాట్లాడ్తున్నాం కానీ, అవి ఆయనకు తెలుగునాట జరిగిన కీలకమైన సామాజిక పరిణామాల సందర్భంలో సహజంగా ఏర్పడినవే. ఈ సందర్భాల్లో ఆయన నిండా ఉద్యమంతో మమేకమై ఉన్నందున…. గొప్ప ఆదర్శాలుగా ముందుకొచ్చిన అంశాలను ఆవాహన చేసుకున్నవే.
చివరి ప్రసంగంలో బాలగోపాల్ భయం గురించి మాట్లాడారు. సమాజంలో సర్వత్రా వ్యాపించిన భయం గురించి. ఈ భయానికి కారణమైన ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణం గురించీ మాట్లాడారు. ఈ భయం వల్ల హక్కుల కోసం ప్రశ్నించేవాళ్లు, అన్యాయాన్ని అన్యా యం అని చెప్పేవాళ్లు, సులభంగా అవకాశవాదం వేపు మళ్లుతున్న దుస్థితి గురించీ ప్రస్తావించారు. ఇప్పుడాయన లేరు. వారం రోజులుగా ఒక వెలితి ఏదో కమ్ముకున్నట్టుగా ఉంది. ఎక్కడో పూరించలేని ఒక లోటు కనపడ్తున్నది. Read the rest of this entry »
బాలగోపాల్ రచనలు
పుస్తకాలు
1. రూపం – సారం సాహిత్య వ్యాసాలు స్నేహ ప్రచురణ, విజయవాడ ఏప్రిల్ 1986
2. కల్లోల కథాచిత్రాలు పర్ స్పెక్టివ్స్ హైదరాబాద్ 1997
3. హిందూ మతరాజ్యం ఫెడరల్ ఇండియా పబ్లికేషన్స్, విజయవాడ మే 1991
4. భారత చరిత్ర – డి డి కోశాంబి పరిచయం
5. కార్టూన్లలో మార్క్స్
7. Probings into the Political Economy of Agrarian Classes and Conflicts, Perspective Publishers, 1988. Read the rest of this entry »
చెరగని హక్కుల స్ఫూర్తి బాలగోపాల్
ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని స్పూర్తిగా మార్చింది. ఆయన సాహిత్య విమర్శ గురించీ, రచన గురించీ, ఉపన్యాసం గురించీ, ఆయన జీవిత విలువల గురించీ, న్యాయవాదిగా ఆయన చేసినపని గురించీ, గణితశాస్త్ర అధ్యాపకుడిగా చేసిన కృషి గురించీ ఎంతయినా చెప్పుకోవచ్చు. కాని ఇక్కడ హక్కుల ఉద్యమ నిర్మాణంలో, వికాసంలో ఆయన సాగించిన కృషి గురించి వివరించడానికి మాత్రం పరిమితమవుతాను. Read the rest of this entry »
అక్షరాలా తీరని లోటు
ఎన్ వేణుగోపాల్
‘‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన ఆలోచించినంత సమగ్రంగా ఆలోచించే, ఆయన పనిచేసినంత సమర్థంగా పనిచేసే మనుషులు తయారు కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము. తెలుగు సమాజం మాత్రమే కాదు యావత్ దేశమే ఒక ఆత్మీయ మిత్రుడిని, హక్కులకోసం ఎలుగెత్తే గొంతును కోల్పోయింది. అటుచివర కాశ్మీర్ నుంచి మరొకచివర ఈశాన్య ప్రాంత ఉద్యమకారులనుంచి, ఛత్తీస్ ఘర్ ఆదివాసులు, గుజరాత్ మైనారిటీలు, కంధమాల్ క్రైస్తవులు, మత్స్యకారులు, ప్రత్యేక ఆర్థిక మండలాల నిర్వాసితులు, దేశవ్యాప్తంగా అభివృద్ధి పథకాల నిర్వాసితులు, ప్రపంచీకరణ విధానాల బాధితులు, రాష్ట్రంలోని అన్ని ప్రజాఉద్యమాల కార్యకర్తలు, విప్లవోద్యమ కార్యకర్తలు, దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలు — ఆయన స్పృశించని బాధిత సమూహం లేదు. ఆయన పట్టించుకోని జీవన సమస్య లేదు. Read the rest of this entry »