ప్రశ్నించడం నేర్పిన మహోన్నతుడు బాలగోపాల్
(Source: Andhra Jyothy, October 16, 2009).
బర్కత్‌పుర, అక్టోబర్ 15 (ఆన్‌లైన్): హక్కుల సాధన విషయంలో ప్రజలకు ప్రశ్నించడాన్ని నేర్పిన మహోన్నతుడు బాలగోపాల్ అని పలువురు వక్తలు నివాళులర్పించారు. ఆయన ఆలోచనా విధానంతో ముం దుకు సాగినప్పుడే రాజ్యహింసను, సామ్రాజ్యవాదాన్ని సమూలంగా నిర్మూలించగలమని ఉద్బోధించారు. అణగారిన ప్రజల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బాలగోపాల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడు తూ బాలగోపాల్ మృతి దళితులకు, ఆదివాసులకు తీరని లోటని చెప్పారు. పోలీసుల హింసతోపాటు.. నక్సలైట్ల హింసను కూడా బాలగోపాల్ ఖండి ంచారని ఆయన అన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరారు.
బూటకపు ఎన్‌కౌంటర్లకు, రాజ్యహింసకు ఎదురొడ్డి పోరాడారని ఆయన అన్నారు. “మానవ హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ మొదటివాడు కాడు. చివరివాడుకూడా కాదు. ఆ ఉద్యమం ఎన్నటికీ సజీవంగానే ఉంటుంది” అని గద్దర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేటి ప్రధాన సమస్య రాజ్యహింస మాత్రమేనని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నక్సలైట్ల ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వారు హక్కుల ఉద్యమాల్లో కొనసాగుతూ ఎందుకు ఏకం కాలేకపోతున్నారని గద్దర్ ప్రశ్నించారు.
అన్ని హక్కుల ఉద్యమాలను మానవీయ కోణంలో చూడాలని కోరారు. తెలంగాణ జనపరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉద్యమాల్లో బాలగోపాల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా రాజ్యాన్ని ప్రశ్నించారని అన్నారు. భయంతో జీవించే గిరిజనులు, ఆదివాసులలో మనోధైర్యాన్ని పెంపొందిం చాడని చెప్పారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జీవన్‌కుమార్ మాట్లాడుతూ బాలగోపాల్ 700 కేసులు వాదిస్తున్నారని, అందు లో దాదాపు 600 కేసులు ఆదివాసు లు, దళితులవేనని అన్నారు. పీడిత ప్రజల ప్రక్షాన కేసులను వాదించడానికి న్యాయవాదులు హెచ్‌ఆర్‌ఎఫ్‌లో పనిచేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు జె.బి.రాజు మాట్లాడుతూ మానవ హక్కుల కోసం జీవితాన్నే త్యాగం చేసిన బాలగోపాల్ విగ్రహాన్ని టాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ.మైసయ్య, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఒలిగి ప్రభాకర్, సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్, తెలంగాణ రచయిత బి.ఎస్.రాములు తదితరులు ప్రసంగించారు.
బడుగువర్గాల ఉద్యమనేత…
యూనివర్సిటీ,అక్టోబరు15(ఆన్‌లైన్): బడుగు వర్గాల ఉద్యమనేతగా ప్ర జాసేవలో జీవితకాలం కొనసాగిన బా లగోపాల్ మరణం హక్కుల ఉద్య మానికి తీరనిలోటని ఈ లోటను భర్తీ చేసేందుకువ విద్యార్థులు, మేధా వులు ముందుకు వచ్చినపుడే ఆయ నకు మనం అర్పించే నిజమైన నివా ళి ప్రముఖ విప్లవ కవి వరవరరావు అన్నారు. పరిశోధనా విద్యార్థుల ఆధ్వర్యంలో ఓయులో, ఇఫ్లూలో జరిగిన బాలగోపాల్ సంస్మరణలో సభలో ఆయన మాట్లాడారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన బాలగోపాల్ తన సామాజిక వర్గాన్ని పూర్తిగా మర్చిపోయి కేవలం ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడని అన్నారు. గణితంలో ఎంతో ప్రావీ ణ్యత కలిగిన ఆయన తన అధ్యాపక వృత్తినే వదిలిపెట్టి ప్రజాసేవకే అంకిత మయ్యాడన్నారు.
తన మేధోసంపత్తు ను అవార్డులు, రివార్డుల కోసం కాకుండా ఈ దేశంలో ఉన్న 80శాతం ఉన్న పేదప్రజలకు వినియోగించాలనే తలంపుతో తన ఉపాధ్యాయ జీవితా న్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన మహామేధావి అని వరవరరావు పేర్కొన్నారు. బాలగోపాల్ విద్యార్థు లకే కాకుండా అధ్యాపకులకు రోల్ మోడల్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ రోజు ఎంతోమంది అధ్యాపకులు తన వృత్తిని వీడి రియల్‌ఎస్టేట్ వ్యా పారం, దందాలు నడుపుతున్న సం దర్బంలో బాలగోపాల్ మరణం వారికి ఈ విధంగానైనా కనువిప్పు కలిగిస్తు ందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఈ దేశంలో జరుగుతున్న దళిత, మహిళ, ఆదివాసి, అస్తిత్వ ఉద్యమాలకు బాలగోపాల్ వెన్నుద న్నుగా నిలిచిన మహానీయుడని పే ర్కొన్నారు.
ఒకనాడు బాలగోపాల్ కిడ్నాప్‌కు గురైతే ఆ ఉదంతాన్ని బిబిసి వంటి ఇంగ్లీస్ చానల్ టెలీకాస్ట్ చేస్తే అదే హక్కుల పోరాటనేత మరణిస్తే ఏ మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేయకపోవడం శోచనీయ మన్నారు. నేటి మహిళా ఉద్యమాలకు బాలగో పాల్ స్పూర్తి అని పిీవోడబ్ల్యు సంధ్య పేర్కొన్నారు. ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ బాలగోపాల్ కు సంబంధించి ఎన్నిపొగ డ్తలు ఉన్నాయో అదేస్థాయిలో ఆయన రాజకీయాలు వివాదమయ్యాయని అన్నారు. బాలగోపాల్ గురించి కత్తిపద్మారావు లాంటి వాళ్లు విమర్శిస్తూ ్త వ్యాసాలు రాస్తున్నారని, కానీ బాలగోపాల్ జీవితం ఆయన కులాన్ని, సామాజిక వర్గాన్ని తలదన్నేదిగా ఉందన్నారు. ఈ సంస్మరణసభలో ఎస్‌ఎఫ్‌ఐ డేవిడ్, ఎఐఎస్‌ఎఫ్ స్టాలిన్, పీడీఎస్‌యు ఉపేందర్, బాలరాజు, రాజేశ్, సత్య, అనిత, కవిత,స్వేత , దుర్గ ,పుష్ప పాల్గొన్నారు.