Archive for the ‘Andhra Jyothy’ tag
ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పుడు?
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy).
తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందుకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యా యం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తులమ య్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. ‘క్లాసికల్’ అనే పదాన్ని ప్రాచీనం అనే అర్థంలో తీసుకునేట్టయితే తమి ళం ప్రాచీనతను రుజువు చేయడానికి కుండ పెంకులూ, శిలా ఫలకాలూ వెతకనక్కర లేదు. తమిళుల సంస్కృతిలో ఇప్పటి కీ సజీవంగా ఉన్న రెండు వేల ఏళ్లనాటి సాహిత్యం ఉంది. Read the rest of this entry »
ఈ కాలపు గాంధీ
- వెల్చాల కొండలరావు
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు, Source: Andhra Jyothy, October 27, 2009).
అరుదైన మనీషి, చాలా అరుదైన మేధావి బాలగోపాల్. అటువంటి వ్యక్తి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందని వారు, దుఃఖితులు కాని వారు ఎవరైనా ఉంటారా? మానవహక్కులకు పర్యాయపదం బాలగోపాల్. అన్ని హక్కులు మానవహక్కులలోనే సమ్మిళితమై ఉన్నాయని గ్రహించి వాటిని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమాలు విజయవంతం కావాలంటే, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలంటే ప్రజలకు వారి హక్కుల గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి. ‘ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలిస్తే వారే వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తారని’ బాలగోపాల్ విశ్వసించారు. Read the rest of this entry »
మనకాలపు పరిపూర్ణ మానవుడు
అల్లం నారాయణ
నిజానికి బాలగోపాల్ నిరాడంబరత, సంపూర్ణ మనిషిలాగా జీవించడం గురించి, నిర్భయత్వం గురించి మాట్లాడ్తున్నాం కానీ, అవి ఆయనకు తెలుగునాట జరిగిన కీలకమైన సామాజిక పరిణామాల సందర్భంలో సహజంగా ఏర్పడినవే. ఈ సందర్భాల్లో ఆయన నిండా ఉద్యమంతో మమేకమై ఉన్నందున…. గొప్ప ఆదర్శాలుగా ముందుకొచ్చిన అంశాలను ఆవాహన చేసుకున్నవే.
చివరి ప్రసంగంలో బాలగోపాల్ భయం గురించి మాట్లాడారు. సమాజంలో సర్వత్రా వ్యాపించిన భయం గురించి. ఈ భయానికి కారణమైన ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణం గురించీ మాట్లాడారు. ఈ భయం వల్ల హక్కుల కోసం ప్రశ్నించేవాళ్లు, అన్యాయాన్ని అన్యా యం అని చెప్పేవాళ్లు, సులభంగా అవకాశవాదం వేపు మళ్లుతున్న దుస్థితి గురించీ ప్రస్తావించారు. ఇప్పుడాయన లేరు. వారం రోజులుగా ఒక వెలితి ఏదో కమ్ముకున్నట్టుగా ఉంది. ఎక్కడో పూరించలేని ఒక లోటు కనపడ్తున్నది. Read the rest of this entry »
ఉద్యమ పరిధిని విస్తరించాడు
నిఖిలేశ్వర్ (Source: Andhra Jyothy, October 11, 2009).
రాజ్యం, దాని స్వభావం వాటిలో ముడివడిన మానవ ప్రవర్తన గురించి మిత్రు లు బాలగోపాల్ నిశితంగా పరిశీలించి రచనలు చేసిన వ్యక్తి. ప్రజాస్వామిక హక్కులు అందరికి సమన్యాయంగా వర్తించాలని, వాటి అమలులో నిరంతరం జరిగిన ఉల్లంఘనలను ఎ త్తిచూపిన మేధావి. గత నాలుగు దశాబ్దాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నక్సల్ ఉద్యమ దశలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ-పాల్గొంటూ వచ్చిన నేను, బాలగోపాల్ రాజకీయ-సామాజిక విశ్లేషణలను ఆసక్తిగా చదివి చర్చించే వాణ్ణి. Read the rest of this entry »