Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

Archive for the ‘Human Rights Movement’ tag

ఐక్యతే హక్కులకు రక్షణ

without comments

యస్‌.శేషయ్య (APCLC)  Source: Andhra Jyothy, November 11, 2009.

అభివృద్ధిపేరుతో జరుగుతున్న విస్తాపన, విధ్వంసం, హిందూ మతోన్మాదం పెరిగి మైనారిటి మతస్తులపై ఊచకోత, ఉగ్రవాదం పేరుతో హక్కుల ఉల్లంఘన, తీవ్రవాదం పెనుప్రమాదం అని చెప్తూ ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో ఆదీవాసీలపై చేస్తున్న యుద్ధం, అన్నీ కూడా హక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదు. హక్కుల సంఘాలు కలిసి ఐక్యంగానే హక్కులను కాపాడుకోగలుగుతాం. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగతాం.

బాలగోపాల్‌ ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమకారులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. బాలగోపాల్‌ ‘ఇక లేడు’ అనే నిస్పృహతోపాటు, ‘పౌరసమాజం’ ఒక రకమైన భయానికి, వెలితికి లోనయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ, ఈ పరిస్థితి తాత్కాలికమే. పురుషోత్తం, ఆజం అలీలను సర్కారీ హంతకముఠాలు కిరాతకంగా హత్య చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. పౌరహక్కుల సంఘం ఇక పనిచేస్తుందా? అనే సంశయం, సందేహాలు ఏర్పడ్డాయి. బాలగోపాల్‌ ఆ సందర్భంలో ‘నిస్పృహను, నిస్సహాయతను అధిగమించడానికి కావల్సిన దృఢ సంకల్పం, మానసిక స్థైర్యాన్ని పురుషోత్తం నుండి ఉద్యమాలు, ఉద్యమకారులు, ప్రజలు నేర్చుకోగలిగితే అతని మరణం వృధా కానట్టే’ అని ధైర్యాన్ని యిచ్చాడు. Read the rest of this entry »

Written by chs

November 13th, 2009 at 8:45 am

చనిపోకూడని మనిషి

without comments

(Source: Vaartha, Editorial – శని వారం, అక్టోబర్ 10, 2009)

పౌరహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్‌ మరణానికి సంతాప సూచకంగా ఈ దేశపు జాతీయ పతాకను ఎవరూ అవనతం చేసే అవకాశం లేదు.ఆయన ఈ దేశం నిజమైన అర్ధంలో ఎవరిదో ఆ అశేషజన బాహుళ్యంకోసం శ్రమించాడు. కాని తమకై నిలిచిన వారికోసం జండాను సగంమేర ఎగరవేసే అధికారం వారికిలేదు. లేనిపక్షంలో పౌరహక్కులనే మాట ఒకటి ఉందని, అది రాజ్యాంగం తమకిచ్చినా అదే రాజ్యాంగం పేరిట ఈ దేశాన్ని పాలి స్తున్నవారు తమకివ్వదలచుకోలేదని, అందుకోసం ఉద్యమించి సాధించుకోవాలని బాలగోపాల్‌ ద్వారా తెలుసుకున్న అశేష జనావళి, ఈ శుక్రవారం నాడు తమ దేశ పతాకను తప్పక అవనతంచేసి ఉండే వారే. Read the rest of this entry »

Written by chs

November 7th, 2009 at 5:51 am