Archive for the ‘Vaartha’ tag
ఉద్యమాలకూ విలువలుండాలన్నవాడు
ఎం కోదండరామ్ (Source: Vaartha, సొమ వారం, అక్టోబర్ 19, 2009)
డా.కె బాలగోపాల్‌కు 1980లో పౌరహక్కుల సంఘంలో చేరినప్పటి నుంచి 2009 అక్టోబర్ 8న మరణించే వరకు పౌరహక్కుల ఉద్యమం వెలుపల వేరొక జీవితం లేదు. ఏకాగ్రతతో తన శక్తియుక్తులన్నింటిని ఆయన పేద, అణచి వేయబడిన వర్గాలహక్కుల సాధనకే ఉపయో గించారు. అందుకే బాలగోపాల్ జీవితం అర్ధం చేసుకోవాలంటే హక్కుల రంగంలో ఆయన చేసిన కృషిని తెలుసుకోవాలి. Read the rest of this entry »
చనిపోకూడని మనిషి
(Source: Vaartha, Editorial – శని వారం, అక్టోబర్ 10, 2009)
పౌరహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ మరణానికి సంతాప సూచకంగా ఈ దేశపు జాతీయ పతాకను ఎవరూ అవనతం చేసే అవకాశం లేదు.ఆయన ఈ దేశం నిజమైన అర్ధంలో ఎవరిదో ఆ అశేషజన బాహుళ్యంకోసం శ్రమించాడు. కాని తమకై నిలిచిన వారికోసం జండాను సగంమేర ఎగరవేసే అధికారం వారికిలేదు. లేనిపక్షంలో పౌరహక్కులనే మాట ఒకటి ఉందని, అది రాజ్యాంగం తమకిచ్చినా అదే రాజ్యాంగం పేరిట ఈ దేశాన్ని పాలి స్తున్నవారు తమకివ్వదలచుకోలేదని, అందుకోసం ఉద్యమించి సాధించుకోవాలని బాలగోపాల్ ద్వారా తెలుసుకున్న అశేష జనావళి, ఈ శుక్రవారం నాడు తమ దేశ పతాకను తప్పక అవనతంచేసి ఉండే వారే. Read the rest of this entry »
హక్కుల ఉద్యమానికి కొత్త వారసత్వం
హరగోపాల్ ( Source: Vaartha, October 20, 2009).
ఆధునిక మానవ హక్కుల ఉద్యమ చరిత్రలో, సిద్ధాంత పరిణామంలో, హక్కుల ఆచరణలో బాలగోపాల్ చిరస్థాయిగా నిలిచే ఒక సజీవమైన మలుపు. ముఖ్యంగా భారతదేశంలోని హక్కుల అవగాహనలో ఆయన చేసిన కృషి ప్రభావం హక్కుల ఉద్యమాలు ఉన్నంత కాలం ఉంటుంది.హక్కుల చరిత్ర పాశ్చాత్య దేశాలలో 13వ శతాబ్దంలో భూస్వాములకు రాజ్యానికి మధ్య వచ్చిన తగాదాలో నుండి మ్యాగ్నా కార్టా పుట్టుకొచ్చింది. అంటే రాజ్యం తాను ఇష్టమొచ్చినట్లుగా నిరంకుశంగా పాలించడానికి వీల్లేదు అనే భావన మానవ చైతన్యంలోకి వచ్చింది. ఆ భావన మరింత బలపడడానికి ఫ్రెంచ్ విప్లవం, అమెరికా అంతర్యుద్ధం, యూరప్‌లో భిన్న దేశాల్లో విభిన్న రూపాల్లో వచ్చిన ఉద్యమాలు దోహదపడ్డాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం లాంటి ఉన్నతమైన విలువలు అభివృద్ధి చెందాయి. రూసో, థామస్ పేయిన్, జెఎస్ మిల్ లాంటి తత్వవేత్తలు వ్యక్తికి లేదా పౌరులకు మధ్య జరిగిన ఒప్పందంలో నుండి రాజ్యం వచ్చిందన్న సూత్రీకరణ చేసారు. జెఎస్ మిల్ వ్యక్తి స్వేచ్ఛను ఆకాశపు హద్దులదాకా తీసు కళ్ళాడు. మార్క్స్ ఈ మొత్తం చర్చను బూర్జువా వ్యవస్థ ఆవిర్భావ క్రమంలో వచ్చాయని, స్వేచ్ఛ సమానత్వ భావనలు ఉదాత్త భావనలైనా, నిత్యజీవితంలో నిజమైన స్వేచ్ఛ సమానత్వం లేనపుడు చట్టం దృష్ట్యా అందరూ సమానమే అనే భావన ఒక భ్రమా జనిత ఊహ (జ్యుడీషియల్ ఇల్యూజన్) అని అన్నాడు. అందుకే మార్క్సిస్టు ప్రేరణతో వచ్చిన ఉద్యమాలలో మానవ హక్కుల ప్రస్తావన చర్చ అంతగా ఉండదు. పందొమ్మిది, ఇరవైయవ శతాబ్దంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలలో, ముఖ్యంగా మూడవ ప్రపంచం అని పిలువబడే దేశాల్లో మానవ హక్కుల భావన, ప్రధానంగా స్వేచ్ఛా స్వాతంత్ర భావనలు, పాశ్చాత్య ఉదారవాద సిద్ధాంతం వల్ల చాలా ప్రభావితమయ్యాయి. కాని అవి చాలా దేశాల్లో స్వాతంత్రం తర్వాత ఆచరణలోకి రాలేకపోయాయి. Read the rest of this entry »
ఆదివాసీలకు అడివంత అండ
| పల్లా త్రినాథరావు (Source: Vaartha, సొమ వారం, అక్టోబర్ 12, 2009 ). |
| ఆదివాసీల ఆత్మబంధువు బాలగోపాల్ ఇకలేరనే వార్త, ఆదివాసీ క్షేత్రాల్లో చీకటినినింపింది. దోపిడీ, హింస, దౌర్జన్యాలను నిరంతరం మౌనంగా భరించే ఆది వాసీలకు డాIIకె.బాలగోపాల్ కొండంత అండగా నిలిచిన వ్యక్తి. ఆనాటి నుండీ ఈనాటిదాకా చాలామంది అర్థం చేసు కోలేకపోతున్న ఒక విషయంమేమిటంటే పర్యావరణ సమతుల్యానికి కావలసింది అడవులుకాదు, చెట్లు. అంటే అటవీశాఖ యాజ మాన్యంలోని భూమిని కబ్జాదార్ల నుంచి, పోడు వ్యవసాయం చేసే ఆదివాసుల నుండి కాపాడి వనాలు పెంచటమే దానికి ఏకైక పరిష్కారమార్గంకాదు. Read the rest of this entry » |