Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

Archive for the ‘VV. Varavara Rao’ tag

ఆదర్శాలు, విలువలు – ప్రజల పట్ల బాధ్యత – బాల గోపాల్ జీవితం

without comments

వరవరరావు ( http://www.pranahita.org/2010/01/aadarshaalu_viluvalu/)

బాలగోపాల్ ను పునర్నిర్మాణం చేయడం ఇంత తొందరలో సాధ్యం కాకపోవచ్చు.కాని ఆయన సమాజం మీద వేసిన ప్రభావం వల్ల ఆయన వ్యక్తిత్వ విశ్లేషణ జరగాల్సే వున్నది. ఆ క్రమంలో ఆయన ఆలోచనలను, ముఖ్యంగా ప్రజాస్వామిక సంస్కృతిని రూపొందించడానికి ఆయన ప్రతిపాదించిన ప్రాపంచిక దృక్పధాన్ని , విలువలను అంచనా కట్టాల్సే వున్నది ముందుగా అందుకోసం మనకుండే ఆకరాలు, పనిముట్లు , సమాచారం -  విడివిడిగా శకలాలుగా, ఙ్ఞాపకాలుగా , అనుభవాలుగా , ఆచరణగా ఉన్నవన్నీ ఒకచోట సమకూర్చుకోవాలి లేకపోతే అర్థసత్యం చెప్పినన వాళ్ళం, అరకొరగా తెలుసుకున్న వాళ్ళమే అవుతాం. అందువల్ల ఇపుడెట్లాగూ ఆయన కొచ్చే నష్టమేమీలేదు. బతికుండగానే ఆయన పొగడ్తలకు,నిందలకు దూరంగా ఉన్నాడు. అయితే అది మన సత్యాన్వేషణకే అవరోధమవుతుంది గనుక అధిగమించాలి. Read the rest of this entry »

Written by chs

February 5th, 2010 at 5:11 am